Header Banner

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఈరోజు నుండి వాటికి ఆన్లైన్ బుకింగ్! డైరెక్ట్ లింక్ ఇదే!

  Wed Apr 23, 2025 10:26        Devotional

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మరియు వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ సమయపట్టిక ప్రకారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా విడుదల అవుతుంది. అలాగే, ఈనెల 24న ఉదయం 10 గంటలకు జూలై నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల గదుల కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్‌ చేయాల్సి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

అలాగే, మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గజవాహనం, అశ్వవాహనం, గరుడవాహనంపై వేంకటేశ్వర స్వామి వేంచేపు చేస్తారు. ఉభయ నాంచారులు పల్లకీలలో కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు. ఈ వేడుకల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పురాణాల ప్రకారం, వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతితో కల్యాణం చేసుకున్న సంఘటనకే గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ నేపథ్యంతో తిరుమలకు భక్తులు భారీగా రావొచ్చని అంచనా. అందువల్లే తిరుపతి జిల్లా పోలీసులు సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలోని ఆ జిల్లాల్లో బంగారం, వజ్రాల గనులు! టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!



నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #TirumalaDarshan #TTDTickets #SrivariDarshan #Angapradakshinam #TTDOnlineBooking #300DarshanTickets #TirumalaRooms #TTDUpdates